తెలుగు నిఘంటువు
శోధింపుము
పూర్తిపదము
పదము ముందు (Prefix)
పదము తరువాత (suffix)
పదములో ఎక్కడైనా
font help
best viewed in IE and firefox
ముంగిలి
బహుళ శోధనము
క్రొత్త పదములను చేర్చండి
మా గురించి
నిఘంటు పరిమితులు మరియు సంజ్ఞలు
Page 1 Of 1
1
చొ%చ్చు%
అ. క్రి.
(వ్యతి రేకాద్యర్థములందు చొరఁడు,చొరమి,చొరక,చొరన్,చొరుము,చొరుఁడు మొ. రూపములగును.)
కడఁగు,యత్నించు,ఉద్యమించు
క. పరుసఁదనము మెయినరి గొనఁ,జొరఁదగ దదిపొదుఁగు కోయుచొప్పగువిను ........
భార. శాం. 2. 299.
పూర్తి పద్యము
శా. ..... యామికు లసంఖ్యాకుల్గడున్బీగముల్, వాకిళ్లుంబదిలంబు లిట్టినగ రెవ్వారల్చొరంజొత్తు రి,ట్లేకాంత్ఆవ సథంబునం దిరుగువారేకాకచర్చింపఁగన్.
విప్ర. 5. 19.
గీ. ..... నామాట వినికార్యగతికిఁజొరుము.
హరి. పూ. 1. 125.
మొదలుపెట్టు,ప్రారంభించు
గీ. అర్కు నుదయాస్తమయముల యందుఁ గృష్ణకాంతిఘోరకబంధంబు గప్పఁజొచ్చె.
భార. భీష్మ.1. 11.
పూర్తి పద్యము
కం. ఉఱుముఱిమిమూలగాడ్పులు,చఱచి విసరఁజొచ్చె......
హర.2. 17.
ఉ....... అచ్చటనచ్చటంజెదరినట్టి బలంబులు దన్నుఁగూడిరాఁ,జొచ్చిన వారితో బిలముఁజొచ్చినలాగును గన్న లాభమున్,జెచ్చెరఁ జెప్పుచున్.......
విక్ర. 2. 154.
ఆయత్తపడు, సిద్ధ మగు
చం. తుడిచినఁబోకమన్మథునిదుర్జనతామహిమం బొరింబొరిం,బడఁతిమెఱుంగుచెక్కిళులఁబర్వెడుఘర్మముగాంచి యంత నా,బడలిక చూడలే కిడుమ పాట్లకుఁజొచ్చినలంగితంచు నె,క్కుడు తమకంబు తోడఁ దల గ్రుచ్చి కవుంగిటఁగూర్చె నత్తఱిన్.
కళా.4. 99.
ఉ......ఈతఁడు దొంగ కూటికే,లాగునఁజొచ్చెఁ దాఁ దలపొలంబుల నిల్చునె సాదు రేఁగినన్.
విప్ర.5. 41.
పోవు
గీ........ఎవ్వ రడ్డపడిన, మెఱపుమెఱచినచాడ్పునఁదఱియఁజొరుము.
భార.విరా. 5. 16.
కం. .......మీ, రరుగుం డేయుండడ్డము, చొరుఁడు వెరవు లావు నెఱయశూరత మెఱయన్.
భార. ద్రో.2.21.
పూర్తి పద్యము
సంభవించు,కలుగు
కం. పితృ కార్య యజ్ఞముఖముల, శ్రుతిచోదిత హింసఁగీడుసొరనేరదు ......
భార. ఆను.4. 291.
వచ్చు
ఉ....... ఉష్ణ మయూఖసుత ప్రసూతికిం,బ్రొద్దులుసొచ్చి యున్నయవి పూర్వదిశా సరసీరుహాక్షికిన్.
నైష. 8.17.
గీ. అంతఁ ద్రేతాయుగము సొచ్చె ........
కవిరా.5. 292.
గీ. సతికిఁబ్రొద్దుల నెల చొచ్చెజడత హెచ్చె.
కళా. 5. 125.
ఒడఁబడు,అంగీకరించు
కం. గురు భీష్మాదుల మనములు, దురమునకుంజొరకయుండ .....
బార. ఉద్యో. 1.58.
గీ. అజుఁడును వారివలని, కరుణ మనువునిరూపించెనరు ల సత్య, చరితు లనిపాలనమునకుఁ జొరఁడ యతఁడు.
భార. శాం.2. 257.
పూర్తి పద్యము
చొ%చ్చు%
స. క్రి.
పొందు, ప్రాపించు
కం. వి త్తముసంసృతి పటలము, వ్ర త్తము కామాది వై రివర్గంబుల నే,డి త్తముచిత్తము హరికిని,జొ త్తమునిర్వాణపదముశుభమగు మనకున్.
భాగ. 7. 249.
శరణు చొచ్చు,ఆశ్రయించు
మ. వినుఁడీనాదు ప్రతిజ్ఞ నీవునిఖిలోర్వీనాథులున్ సింధురా,జు నవశ్యంబునునెల్లి సంపుదుభయస్థుండైనినుంజొచ్చినన్,వనజాక్షున్ శరణంబు వేఁడినను........
భార. ద్రో. 2. 277.
పూర్తి పద్యము
చం. సుర లనినోడిదిక్పతులఁజొచ్చిరిదిక్పతులున్సురాలియున్,సురపతిఁజొచ్చిరింద్రుఁడునుజుట్టినదిక్పతులున్సురౌఘమున్, సరసిజనాభుఁ జొచ్చిరటఁజక్రియునా సురరాజు దిక్పతుల్, సురలుఁగుమారకున్శరణుసొచ్చిరితారకుఁడంటఁదాఁకినన్.
కు. సం.12. 907.
కం...... ముకుం,దుని నాశ్రయింపవయ్య య,తనిఁజొచ్చిన బ్రదుకుదీవుఁ దమ్ములుసుతులున్.
భార. ఉద్యో.2. 321.
చొ%చ్చు%
స. క్రి. అ. క్రి.
ప్రవేశించు,చొరఁబాఱు
కం. పరిహాసముభాషణమును,నిరీక్షణములోనుగాఁగ నింద్యంబులుసుం,దరులయెడదీనికేమని,చొరఁదగదట్లైనమనసుసొత్తురుసుదతుల్.
భార. శాం. 4. 300.
పూర్తి పద్యము
చం.......బె, ట్టి దముగఁజొచ్చె నాహవపటిష్ఠుఁడు భీముఁడు వారి సై న్యమున్.
భార. భీష్మ. 2. 367.
పూర్తి పద్యము
కం. హరిణాజినోత్తరీయుఁడు,నిరాయుధుఁడునగుచు నతని నెలవగు నడవిన్,జొర.........
ఆము.3. 26.
కం. విచ్చి చనకుండఁ బసులం, దెచ్చుటమునుమున్నవలయుతెఱఁగాపనికిన్,జొచ్చి యది చక్కఁబెట్టఁగ,నచ్చోటనదాయమనకునగపడెడుబలే.
భార.విరా. 4. 248.
గీ. బాలుఁడవు నీవు కుంభజప్రముఖ సైన్య, పతులు ప్రౌఢులు పెక్కులుబవరములకుఁ, జొచ్చియెఱుఁగని నీచేతఁ జచ్చువారు, గారు .........
భార. ద్రో.2.14.
పూర్తి పద్యము
చం...... భయముసొచ్చిజనార్దనుతమ్ము తోడి యో,ధులుపిఱు సన్న ......... (భయము సొచ్చు=భయపడు. )
భార. భీష్మ. 2. 325.
ఇట్లే:దిగులుచొచ్చుజళుకుసొచ్చు మొ.
సీ. యదుపుంగవున కింతయసకారమొనరించిదేవ తావిభుఁడై న దిగులుచొరఁడె.
ఉ. హరి.5. 282.
సీ. జళుకుసొచ్చినయట్టిజక్కవకవభంగిగరువంపు బిగిచన్నుఁగవవణంక.
విక్ర.7.102.
మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు
కవితా రెడ్డి
వీరి బ్లాగు పేరు తెలియదు