మెయి
వి.
రూపాంతర పదాలు | వ్యుత్పత్తి | మూల పదములు | శాస్త్ర విభాగము |
- మై
- మయి
| | | |
పరభాషా సారూప్యత గల పదములు
- కన్నడ మెయ్
- తమిళము మెయ్
- దేహము, ఒడలు
- గీ. మేను నెమ్మేను మై మయి మే మెయి యొడ, లన శరీరంబు దగు ... ఆం. భా. 2.134
- సీ. అతఁడు పండ్రెండు వాలమ్ము లా భీభత్సు మెయిఁ గ్రుచ్చి ... భార. శల్య. 1.122
- కం. కాంచనపాంచాలిక వలె, మించిన యక్కాంచనాంగి మెయిజిగిపయి వ్యా, పించం గాంచిన తరువులు, కాంచనతరువుల తెఱంగుఁ గైకొన నచటన్. ఉ. రా. 2.125
- సీ. ఘనసారకాశ్మీర గంధసారోదార మృగమదపంకంబు మెయిఁ దనర్ప. విక్ర. 1.8
- పార్శ్వము, ప్రక్క
- వ. ... నిర్మర్యాదంబుగాఁ బెనంగు సైన్యద్వితయంబు మందరక్షుభితాంబుధి చందం బగుటకుం దగి యుచ్చిపోయెడు శరంబులు నిరుమెయిన్ గెలిచిన కుంతక్షురకాదులును ... భార. భీష్మ. 1.267
- ఉ. ... శిష్యపంక్తి య, త్యాదరలీల నిర్మెయిల యందుఁ దనుం గొలువన్ మహోన్నతిన్. విక్ర. 6.5
- వెంబడి
- కం. ఏకరసమయక్షేత్ర మ, నేకౌషధిరసమయంబయిన యట్ల సుమీ, యేకవిధ మైన బుద్ది య, నేకములగు కర్మముల మెయిం బోక నృపా. భార. శాం. 4.195
- శ్లో. యథా హ్యేకరసా భూమి రోషద్యర్థానుసారిణీ, తథా కర్మగతా బుద్ధిరంతరాత్మానుదర్శినీ. సం. భార. శాం. 204.17
- గీ. మేఁతకై పోవు కదుపుల మెయి వడిన క, ళిందకన్యాతటంబుల నిందు నందు, నాడుచును బాడుచును వల్లవాన్వితముగ, నరిగె బలదేవుఁడును తోన యరుగుదేర. హరి. పూ. 7.3
- విధము, రీతి
- కం. మనలోన నెవ్వఁ డెమ్మెయి, పనివెంటను విరటు మనము పడయుదము. భార. విరా. 1.65
- సీ. హిమరుచి కీమెయి యెందుండి వచ్చె నితాంతసుధాపూర్ణకాంతి దనర. కు. సం. 5.600
- గీ. తండ్రి పిమ్మట నివి యేము తగిన భంగిఁ, బంచుకొన నేర కిమ్మెయిఁ బ్రతిదినంబుఁ, బోరుచున్నారము. విక్ర. 2.8., నైష. 1.45
- జ: మెయికొను, మెయికోలు, మెయితాలుపు, మెయిపాలు, మెయిమఱపు, మెయిమఱువు, మెయివడి, మెయివెట్టు, మెయిసిరి